PM Kisan payment Status telugu - Prajavolunteers
PM Kisan payment Status :- నేడు రైతుల అకౌంట్లోకి డబ్బులు
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 5వ తేదీ శనివారం రోజున 18వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున నగదు సాయాన్ని కేంద్రం అందిస్తోంది. ఈ రూ.6 వేలను మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17 విడతల్లో అర్హులైన రైతులకు పంట సాయం అందించింది.