Free Gas Cylinder Booking :ఉచిత గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేసుకోవాలి.. పూర్తి వివరాలు!
Free Gas Cylinder Booking :-
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ ప్రారంభమైంది. దీపావళి కానుకగా ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉచిత సిలిండర్ల కోసం బుకింగ్‌లు ఇవాళ నుంచే (అక్టోబర్ 29) ప్రారంభించారు.
అర్హతలు ఇవే:
- ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్ ఉండాలి
- తెల్ల రేషన్ కార్డు ఉండాలి
- ఆధార్ కార్డు ఉండాలి
ఉచిత గ్యాస్ సిలిండర్లకు అర్హత, బుకింగ్స్ వివరాలివే
➤ మరోవైపు ఏపీలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
➤ అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఎల్పీజీ కనెక్షన్, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు వివరాలు సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది.
➤ ఈ వివరాలతో బుకింగ్ చేసుకుంటే సిలిండర్ బుక్ అయ్యినట్లు ఫోన్లకు సమాచారం వస్తుంది.
➤ ఇక గ్యాస్ సిలిండర్ బుక్ అయిన తర్వాత పట్టణాల్లో అయితే 24 గంటల్లో, గ్రామాల్లో అయితే 48 గంటల్లో సిలిండర్ డెలివరీ చేస్తారు.
➤ సిలిండర్ డెలివరీ అయిన రెండురోజుల్లోగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమచేస్తారు.
➤ గ్యాస్ సబ్సిడీ కింద రూ.851లు జమచేస్తారు.
➤ ఇక ఈ సబ్సిడీ కోసం రూ.895 కోట్లు నిధులు విడుదలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
➤ గ్యాస్ సిలిండర్ అందకపోతే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవచ్చంటే..
➤ మరోవైపు ఈ నెల 31 నుంచి 2025 మార్చి 31 లోపు మొదటి సిలిండర్ కోసం బుక్ చేసుకోవచ్చు.
➤ ఇక ఏప్రిల్ 1 నుంచి జులై 30 వరకూ రెండో ఉచిత సిలిండర్ పొందే వీలుంది, ఆగస్టు 1 నుంచి నవంబర్ 31 వరకూ మూడో సిలిండర్ పొందవచ్చు.
➤ ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు ఏటా 2,684 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా.
➤ మరోవైపు బుధవారం రోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి.. మొదటి సిలిండర్ అందజేయనున్నారు.
ఫ్రీగా గ్యాస్ సిలిండర్.. ఇలా బుక్ చేసుకోండి
➤ పాత విధానంలోనే గ్యాస్ ఏజెన్సీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.
➤ ఆయిల్ కంపెనీ యాప్లోనూ అవకాశం ఉంటుంది.
➤ ఇప్పటికే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు లింక్ అయిన గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము అకౌంట్లలో జమ అవుతుంది.
➤ బుక్ చేయగానే లింక్ అయిన నంబర్ కు మెసేజ్ వస్తుంది.
➤ సిలిండర్ తీసుకునేటప్పుడు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో అంతే మొత్తం ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.