నవ దంపతులకు కొత్త కార్డులు - Prajavolnteers
క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డు
- రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వ కసరత్తు
- నవ దంపతులకు కొత్త కార్డులు
- త్వరలో దరఖాస్తుల స్వీకరణ
అమరావతి: రాష్ట్రంలో నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టల్ తెరవనుంది. దీంతోపాటు రేషన్ కార్డు రూపురేఖల్ని పూర్తిగా మార్చనుంది. క్రెడిట్ కార్డు తరహాలో.. క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గానీ ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
2 లక్షల మందికి..
రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. నవ దంపతుల నుంచి అందిన దరఖాస్తులు సుమారు 70 వేలకు పైగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులు కూడా కలిపితే 2 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు 1. 50 కోట్లకు చేరే అవకాశం ఉంది.
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు వైకాపా రంగుల్ని పోలి ఉన్నాయి. జగన్ బొమ్మలతో ఇచ్చారు. వాటిని సమూలంగా మార్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రెడిట్ కార్డును పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేయించారు. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలి సేలా రూపొందించారు. సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుంది.
◆ గతేడాది డిసెంబరులోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని.. సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని ప్రాథమికంగా కూటమి ప్రభుత్వం నిర్ణయిం చింది. అధికారులు రెవెన్యూ సదస్సుల్లో నిమగ్నమ వ్వడం, ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతుండ. డంతో కార్డులకు దరఖాస్తులు తీసుకునే ప్రక్రియను వాయిదా వేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది.
◆ దరఖాస్తు చేసుకున్న వెంటనే కొత్త రేషన్ కార్డు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినా.. కొద్ది రోజులకే దాన్ని పక్కన పెట్టారు. ఆరు నెలలకోసారి ఇస్తా మంటూ తిరకాసు పెట్టారు.
◆ రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు.. ఏడా దిగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.
కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకూ అను మతించలేదు. దీంతో వేలాదిమంది ప్రభుత్వ పథకా లకు అర్హత సాధించలేకపోయారు. ఇదే సమయంలో ఆన్లైన్ దరఖాస్తుల విధానాన్ని నిలిపివేశారు. వీటన్ని టికీ పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.