PM Kisan: 19 విడత ఆర్థిక సాయం.. జాబితాలో మీ పేరు ఉందా.. ఇలా చెక్ చేసుకోండి.. - Praja volunteers
PM Kisan: 19 విడత ఆర్థిక సాయం.. జాబితాలో మీ పేరు ఉందా.. ఇలా చెక్ చేసుకోండి..
రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం.. పీఎం కిసాన్ సమాన్ నిధి పేరుతో ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌కు సంబంధించిన ఆర్థిక సాయాన్ని 18 విడతలుగా అందజేసింది. తాజాగా, 19 విడత ఆర్థిక సాయాన్ని త్వరలో విడదల చేయనుంది.
పీఎం కిసాన్ (PM Kisan) సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన 19వ విడత నిధులను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాదీ రూ.6,000 నగదును అందజేస్తున్నారు. ఒక్కో విడుదలో రూ.2000 చొప్పున మూడు విడతల్లో మొత్తం నగదును నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో బదిలీ చేస్తారు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
➧ ముందుగా PM KISAN వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
➧ New Farmer Registrationపై క్లిక్ చేయాలి.
➧ అందులో ఆధార్, జిల్లా, రాష్ట్రం తదితర వివరాలన్నీ నమోదు చేయాలి.
లబ్ధిదారుల జాబితా ఇలా చెక్ చేసుకోండి..
➧ ఇందుకోసం www.pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
➧ అందులో ‘‘Beneficiary List’’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
➧ అందులో మీ చిరునామా వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి.
➧ ఆ తర్వాత ‘‘Get Report’’ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
నగదు పడిందో లేదో ఇలా చూసుకోవచ్చు..
➧ ఇందుకోసం https://pmkisan.gov.in/ పోర్టల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.
➧ అందులో ‘‘Know Your Status’’ పై క్లిక్ చేయాలి.
➧ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి, క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి.
➧ ఆ తర్వాత ‘‘Get OTP’’పై క్లిక్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.