ఆధార్ కార్డు ఉన్న మహిళలకు శుభవార్త.. ఉచితంగా కుట్టుమిషన్.. దరఖాస్తు చేసుకోండిలా.. - Praja Volunteers
ఆధార్ కార్డు ఉన్న మహిళలకు శుభవార్త.. ఉచితంగా కుట్టుమిషన్.. దరఖాస్తు చేసుకోండిలా..
Good News Womens PM Modi Free Sewing Machines :-
కేంద్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్తను తెలియజేసింది. ముఖ్యంగా వివిధ రకాల వృత్తులు చేసే వారికి ప్రత్యేక యంత్రాలు, పనిముట్లు ఇస్తోంది.ఈ క్రమంలోనే మహిళలు, పురుషులకు ఉచితంగా కుట్టుమిషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దేశంలో వివిధ వృత్తుల వారికి కేంద్ర ప్రభత్వం ప్రత్యేక పరికరాుల, యంత్రాలు వివిధ స్కీముల ద్వారా అందిస్తుంది. కేంద్ర ప్రధానమంత్రి ‘విశ్వ కర్మ యోజన పథకం’ ద్వారా కుట్టు మిషన్ కొనుగోలు చేయడానికి రూ.15 వేలు పొందవొచ్చు. ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి జమ అవుతుంది. ఒక వారం డిజిటల్ శిక్షణ కూడా ఇస్తుంది. ఆ సమయంలో రోజుకు రూ.500 చెల్లిస్తారు.
కుట్టు మిషన్ కొనుగోలు చేసిన తర్వాత కేంద్రం లక్ష రూపాయలు ఇస్తుంది. ఈ రుణాన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించవొచ్చు. రుణాన్ని చెల్లించని తర్వాత మీరు రెండు లక్షల వరకు తదుపరి రుణాన్ని తీసుకోవచ్చు. దీన్ని 30 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలా కుట్టు మిషన్ ద్వారా దుఖానం పెట్టుకునేందుకు కేంద్ర రుణం మంజూరు చేస్తుంది. ఈ రుణాలపై వడ్డీ చాలా తక్కువ.. రుణాలకు వర్తించే క్రెడిట్ గ్యారెంటీ ఫీజును కేంద్ర చెల్లిస్తుంది. ఈ పథకానికి మహిళలే కాదు.. పురుషులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం