NREGA : ఏపీలో ఉపాధి హామీ పథకం పై బిగ్ అప్డేట్ - Praja Volunteers
NREGA : ఏపీలో ఉపాధి హామీ పని దినాల పెంపు
అమరావతీ :
➧ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది పని దినాలను పెంచేందుకు అంగీకారం తెలిపింది.
➧ గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కేటాయించిన 15కోట్ల పని దినాలు జూలైకి ముగుస్తున్న నేపథ్యంలో పనిదినాలను మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మనవి చేయడం జరిగింది.
➧ ఈనేపథ్యంలో ఏపీలో ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 21.50 కోట్ల పని దినాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
➧ ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
➧ అదేవిధంగా రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు.